నటుడు చంద్రమోహన్ గురించి మీకు తెలియని విషయాలివే..

-

సినిమా ఇండస్ట్రీలో స్టార్ డమ్ అనేది చాలా కీలకం అని సినీ పరిశీలకులు చెప్తుంటారు. ఆ స్టార్ డమ్ వస్తేనే అవకాశాలు వాటంతట అవి తలుపు తడుతాయని పేర్కొంటుంటారు. కాగా, కొంత మంది అతి తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ పొందుతుంటారు. కానీ, కొందరు మాత్రం అలానే మిగిలిపోతుంటారు. బహుశా రెండో కోవకు చెందిన వ్యక్తి నటుడు చంద్రమోహన్ కావచ్చు.

అప్పట్లోనే హీరోగా నటించిన చంద్రమోహన్ తర్వాత కాలంలో స్టార్ హీరో స్టేటస్ పొందలేకపోయారు. ఇప్పటికీ నటుడిగానే పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా, ఆయనతో నటించిన హీరోయిన్స్ అందరూ తర్వాత కాలంలో స్టార్స్ అయిపోవడం విశేషం.

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత..కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సిరి సిరిమువ్వలు’ చిత్రంలో కథానాయకుడు చంద్రమోహన్ కాగా, కథానాయికగా జయప్రద నటించింది. ఈ సినిమా తర్వాత జయప్రద కు హీరోయిన్ గా చక్కటి అవకాశాలు అభించాయి. సీనియర్ ఎన్టీఆర్ సరసన నటించే అవకాశాలు పొందింది.

చంద్రమోహన్ సరసన హీరోయిన్ గా నటించిన శ్రీదేవికీ తర్వాత కాలంలో స్టార్ హీరోలు ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ల సరసన నటించే అవకాశాలు వచ్చాయి. జయసుధకు కూడా చంద్రమోహన్ సరసన హీరోయిన్ గా నటించిన తర్వాత పెద్ద సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశాలు వరుసగా వచ్చాయి.

విశ్వనట భారతి విజయశాంతి సైతం..చంద్రమోహన్ సరసన హీరోయిన్ గా నటించిన తర్వాత చక్కటి అవకాశాలు పొందింది. అలా చంద్రమోహన్ సరసన కథానాయికలుగా నటించిన హీరోయిన్స్ తర్వాత కాలంలో స్టార్స్ అయిపోయారు. కానీ, చంద్రమోహన్ మాత్రం నటుడిగానే మిగిలిపోయారని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version