పెళ్లిళ్ల సీజన్‌ ఎఫెక్ట్.. వడివడిగా పసిడి పరుగులు

-

పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో బంగారం ధరలకు బ్రేక్‌లు పడడం లేదు. రోజు రోజుకు పసిడి ధరలు పెరుగుతూ పోతున్నాయి. అయితే.. దేశంలో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. దీపావళి తర్వాత నుంచి ధరల్లో భారీ మార్పులు వచ్చాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరిగిపోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును మళ్లీ పెంచింది. ఈ ఒక్క ఏడాదిలోనే ఇప్పటికి ఐదుసార్లు రెపో రేటును పెంచింది. మొత్తం 2.25 శాతం మేర పెరిగి రెపో రేటు 6.25 శాతానికి పెరిగింది. ఇక దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై150 పెరుగగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.160 వరకు పెరిగింది. ఇక వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. కిలోపై రూ.500లకుపైగా పెరిగింది. అయితే రిజర్వ్‌ బ్యాంక్‌ రెపో రేటు పెంచిన మరుసటి రోజే బంగారం, వెండి ధరలు ఎగబాకాయి. డిసెంబర్‌ 11న దేశంలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,150 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.54,440. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.54,59. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.54,440. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.54,490. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.54,440. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.54,440. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900, ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.54,440.

Read more RELATED
Recommended to you

Exit mobile version