మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు

-

బంగారం ధర ప్రతిరోజూ మారుతుంటుంది. అంతర్జాతీయంగా చోటుచేసుకునే మార్పుల కారణంగా ధరల పెరుగుదల లేదా తగ్గుదల ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వ, వడ్డీ రేట్లు, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. అయితే.. వరుసగా రెండో రోజు కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. ముందురోజుతో పోలిస్తే దాదాపు 22, 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు సుమారు రూ.70వరకు తగ్గుదల కనిపించింది. మంగళవారం, బుధవారం కలిపి దాదాపు గ్రాముకు బంగారం ధర రూ.90 తగ్గినట్లయింది. బంగారం కొనాలనుకునే వారు ఎప్పుడు ధర దిగివస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. ధర తగ్గినప్పుడు పసిడి కొనుగోలు చేయాలని చాలా మంది భావిస్తుంటారు.

భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గర ఉన్న బంగారమే మన ఆస్తి అవుతుందని చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు సైతం బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అదే కొంత ఉన్నత వర్గాలకు, ధనిక కుటుంబాలకు చెందిన వారైతే.. మార్కెట్లోకి వచ్చే నూతన మోడల్స్ ను కొనుగోలు.. ఆ ఆభరణాలతో తమను అలంకరించుకుంటారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనేటప్పుడు చూసేది ధర, గతంలో ధర ఎలా ఉంది, భవిష్యత్తులో తగ్గుతుందా, పెరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా గత కొద్దిరోజులుగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసి పెరిగితే కొద్ది రోజులు ఆగుదామని, ధర కొంత తగ్గుదల కొనిపిస్తే వెంటనే కొనుగోలు చేయడం చేస్తుంటారు. మరి ఈరోజు (12అక్టోబర్ 2022) బంగారం, వెండి ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో సహా, దేశంలోని ప్రధాన నగరాల్లో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

హైదరాబాలో 22 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే మంగళవారం ధరతో పోలిస్తే బుధవారం బంగారం ధరలో రూ.70 తగ్గుదల కనిపించింది. గ్రాము బంగారం ధర బుధవారం రూ.4,690గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.46,900గా ఉంది. 24 క్యారెట్ల బంగారం కూడా మంగళవారంతో పోలిస్తే బుధవారం ధర గ్రాముకు రూ.77 మేర తగ్గింది. గ్రాము బంగారం ధర 5,116గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.51,160గా ఉంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నంతో పాటు తెలంగాణలోని వరంగల్ లో కూడా కొనసాగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version