కరోనా ప్రభావంతో గత వారం రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు సోమవారం ఉదయం భారీగా తగ్గాయి. వారం రోజులుగా 45 వేల పైన ఉన్న బంగారం ధరలు 42 వేలకు పడిపోయాయి. వారం రోజులుగా మూడు వేలకు పైగా బంగారం ధర తగ్గింది. డిమాండ్ తగ్గడం కూడా బంగారం ధరల మీద ప్రభావం చూపించాయి. సోమవారం హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర భారీగా తగ్గింది.
24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.930 తగ్గింది. దీనితో రూ.42,920కు దిగి వచ్చింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే, 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.860 తగ్గడంతో రూ.39,340కు పడిపోయింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు పడిపోయాయి. ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధర రూ.850 మేర తగ్గింది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.850 తగ్గడంతో రూ.40,200కు దిగి వచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర విషయానికి వస్తే రూ.850 తగ్గడ౦తో రూ.41,400కు దిగి వచ్చింది. ఇక వెండి ధర రూ.230 తగ్గుదలతో రూ.47,800కు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం ధరలు పడిపోయాయి. ఇదే కొనసాగితే మాత్రం మరో రెండు రోజుల్లో 40 వేలకు దిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.