గత నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఇప్పుడు పెరగడం మొదలుపెట్టాయి. రెండు రోజులుగా భారీగా తగ్గింది బంగారం. సోమవారం ఒక్క రోజే దాదాపు వెయ్యి రూపాయల వరకు తగ్గింది బంగారం ధర. దీనితో కొనుగోలు దారులు ఎక్కువగా ఆసక్తి చూపించారు. కరోనా ప్రభావం తో బంగారం ధరలు మరింతగా తగ్గుతాయని భావించారు అందరూ. కాని మళ్ళీ పెరుగుదల నమోదు చేసాయి.
హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.290 పెరగడంతో రూ.43,220కు చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.270 పెరగడంతో రూ.39,620కు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు కాస్త పెరిగాయి. బంగారం ధర రూ.240 ఢిల్లీ లో పెరిగింది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.240 పెరగడంతో రూ.40,450కు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.240 పెరగడంతో రూ.41,650కు పెరిగింది. వెండి ధర విషయానికి వస్తే కేజీ కి రూ.250 పెరుగుదలతో రూ.48,060కు చేరుకుంది. కరోనా ప్రభావం అంతర్జాతీయ మార్కెట్ లపై భారీగా పడటంతో బంగారం ధరలో ఇటీవల భారీ మార్పులు సంభవించాయి.