అండర్-19 ప్రపంచ కప్ టోర్నమెంట్ తుది దశకు చేరుకుంది. నేడు ఫైనల్ ఫైట్ జరగనుంది. ఇంగ్లాండ్ ను యంగ్ టీమిండియా ఢీ కొట్టనుంది. వెస్టిండీస్ లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్డేడియంలో ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇండియా కాలామాన ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు అత్యధికం నాలుగు సార్లు అండర్-19 ప్రపంచ కప్ ను టీమిండియా గెలిచింది. ఈ మ్యాచ్ లో కూడా గెలిచి ఐదో సారి అండర్ -19 ప్రపంచ కప్ ను ఖాతాలో వేసుకోవాలని యష్ ధుల్ సేనా ఆరాట పడుతుంది.
అయితే ఈ సారి అండర్ – 19 ప్రపంచ కప్ లో టీమిండియా ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోలేదు. ప్రధాన ఆటగాళ్లుకు కరోనా సోకి.. మ్యాచ్ లకు దూరంగా ఉన్నా.. ఒక్క మ్యాచ్ లో కూడా ఓటమి అనేది ఎరగకుండా ఫైనల్ కు దూసుకువచ్చారు. బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ యష్ ధుల్ తో పాటు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ బలంగా కనిపిస్తున్నారు. అలాగే ఓపెనర్లు రఘువంశీ, హర్నర్ సింగ్ కూడా అద్భుతాలు సృష్టిస్తున్నారు.
వీరికి తోడు ఆల్ రౌండర్లు నిశాంత్ సింధు, రాజ్ కూడా రాణిస్తున్నారు. అలాగే బౌలింగ్ విభాగంలో రవి కుమార్, విక్కి ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. అయితే ఇంగ్లాండ్ కూడా బలమైనా జట్టుగానే ఉంది. ఇంగ్లాండ్ కు కూడా బ్యాటింగ్, బౌలింగ్ పటిష్టంగా ఉంది.