తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బీజేపీ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు చందుపట్ల జంగారెడ్డి మరణించారు. తీవ్ర అనారోగ్యంతో గత కొన్ని రోజుల నుంచి బాధ పడుతున్న మాజీ ఎంపీ జంగా రెడ్డి… నిన్న అర్ధ రాత్రి మరణించినట్లు సమాచారం అందుతోంది. రాత్రి ఒక్క సారిగా ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడ్డారు మాజీ ఎంపీ జంగా రెడ్డి. ఈ తరుణంలోనే.. ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ జంగా రెడ్డి మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబం విషాదంలోకి వెళ్లింది. చందుపట్ల జంగారెడ్డి ఎమ్మెల్యే, అలాగే పార్లమెంట్ సభ్యులుగా పని చేశారు. ఆయన సొంత నియోజక వర్గం పరకాల. పరకాల నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా భారతీయ జనసంఘ పార్టీ నుండి ఇండిపెండెంట్ బి. కైలాసం పై గెలిచి శాసనససభలో అడుగుపెట్టారు. అనంతరం… హనుమకొండ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి ఎంపీ అయ్యారు. కాగా.. మాజీ ఎంపీ జంగా రెడ్డి మృతి పట్లు తెలంగాణ బీజేపీ నేతలు సంతాపం తెలిపారు.