నేడు దళిత బంధు పై సీఎం కేసీఆర్ కీలక సమావేశం

నేడు ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2.30 కి సీఎం కేసీఆర్ అధ్యక్షతన దళితబంధు ను పైలట్ ప్రాజెక్టుగా అమలు పరచనున్న నాలుగు మండాలల్లో పథకం అమలు కోసం, సన్నాహక సమావేశం జరుగనుంది.

మధిర నియోజక వర్గంలోని చింతకాని మండలం, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి మండలం, అచ్చం పేట -కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ మండలం మరియు జుక్కల్ నియోజక వర్గంలోని నిజాం సాగర్ మండలాల్లో దళితబంధు ను అమలు చేయనున్నారు. ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలుకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణ కోసం ‘ దళిత బంధు పథకం అమలు సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యం లో ఖమ్మం, నల్లగొండ,మహబూబ్ నగర్, నిజామాబాద్, నాలుగు జిల్లాలకు చెందిన మంత్రులు పాల్గొననున్నారు .