నేడు సూర్యగ్రహణం.. 22 ఏళ్ల తర్వాత అరుదైన దృశ్యం..

-

నేడు ఇండియాలో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. 22 ఏళ్ల తర్వాత అరుదైన సూర్యగ్రహణం ఏర్పడనుంది.22 ఏళ్ల తర్వాత అరుదైన కేతుగ్రస్తా సూర్యగ్రహణం నేడే ఏర్పడింది. సాయంత్రం 4.29 గంటలకు ప్రారంభమై, 1.15 గంటలపాటు సూర్యగ్రహణం ఉంటుందని పంచాంగ కర్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలోని ఆలయాలు మూతపడనున్నాయి. ఇవాళ సాయంత్రం 4.29 నుంచి గ్రహణకాలం ప్రారంభం. కానుంది.

గరిష్టంగా గంట 45 నిమిషాల పాటు గ్రహణం ఉండనుంది. తిరుమల, విజయవాడ, శ్రీశైలం, యాదాద్రి, భద్రాచలం సహా ప్రముఖల ఆలయాల మూసివేయనున్నారు. నేడు శ్రీవారి ఆలయం ఇవాళ ఉద‌యం 8 నుండి రాత్రి 7.30 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌యం మూసివేయనున్నారు. గ్రహణం కారణంగా బ్రేక్ ద‌ర్శనం, శ్రీ‌వాణి, 300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, వృద్ధులు, విక‌లాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రులు, ర‌క్ష‌ణ సిబ్బంది, ఎన్ఆర్ఐల ద‌ర్శ‌నంతోపాటు ఆర్జిత సేవ‌లైన క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార‌సేవ‌ల‌ను రద్దు చేసింది టిటిడి. గ్రహణం అనంతరం స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌ను మాత్ర‌మే అనుమ‌తించనుంది టిటిడి.

Read more RELATED
Recommended to you

Exit mobile version