తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర టూర్ ఖరారు అయింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మహారాష్ట్రకు వెళ్తున్నారు ఉ. 8 గంటలకు శంషాబాద్ నుంచి ముంబైకి వెళ్ళనున్నాడు. ముంబైలో అక్కడి కాంగ్రెస్ సీఎంల సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. నవంబర్ 20న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికల మ్యానిఫెస్టోపై సలహాలు వంటి పలు విషయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఎన్నికలలో రేవంత్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. ఇది ఇలా ఉండగా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు కావడంతో పలువురు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, ప్రతిపక్షనేతలు ఇలా అందరూ శుభాకాంక్షలు చెప్పారు. కానీ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మాత్రం ఇప్పటివరకు రేవంత్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పకపోవడం గమనార్హం.