కొడంగల్ లో ప్రజల మీద సీఎం దాడులు చేయిస్తున్నారు : కాసం వెంకటేశ్వర్లు

-

ప్రజల ఆగ్రహం అధికారుల పై దాడి కాదు కాంగ్రెస్ ప్రభుత్వం పై దాడి అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. కొడంగల్ లో ఎవరు ప్రశ్నిస్తే వారి మీద కేసులు పెడుతున్నారు. కాంగ్రెస్ నేతలు రైతులను బెదిరించారు… ఇచ్చిన ఇవ్వకున్న భూములు గుంజుకుంటామని హెచ్చరించారు. ఇంటర్నెట్ లు బందు చేయడం తెలంగాణ లో మొదటి సారి. ఇంత దుర్మార్గం ఎప్పుడు జరగలేదు. చౌటుప్పల్ లో ఫార్మా ఇండస్ట్రీ తో ఇబ్బందులు కనిపిస్తాలేవా.

కానీ బామ్మర్ది మీద ప్రేమతో కొడంగల్ లో ప్రజల మీద సీఎం దాడులు చేయిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బ్రొకరిజం చేస్తుంది. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డీ నీ కాంగ్రెస్ పార్టీ నీ ప్రజలు తరుముతారు. కేటీఆర్ డిల్లి పోవడం వెనుక మతలబు వేరే ఉంది. కాంగ్రెస్ కు ఎన్నికల ఖర్చు కోసం డబ్బులు ఇవ్వడం కోసం డిల్లి కి వెళ్ళారు. అక్రమంగా సంపాదించిన డబ్బులను మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకి ఇచ్చేందుకు వెళ్ళారు. అరెస్ట్ నుండి తప్పించుకునేందుకు కేటీఆర్ కాంగ్రెస్ తో మాట్లాడుకుంటున్నారు. BRS కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి అని కాసం వెంకటేశ్వర్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news