తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు…. మరికాసేపట్లో వరంగల్ జిల్లా కు వెళ్లనున్నారు. కరీంనగర్ మాజీ ఎంపీ, టిఆర్ఎస్ పార్టీ కీలక వ్యక్తి అయిన బోయిన్ పల్లి వినోద్ కుమార్ కుమారుడి వివాహం నేపథ్యంలో…. వరంగల్ వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. ఈ వివాహానికి ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం హాజరు కానున్నారు.
ఇక అక్కడి నుంచి రాత్రి 7 గంటల ప్రాంతంలో కరీంనగర్ జిల్లాకు వెళ్లనున్నారు. ఇంకా ఇవాళ రాత్రి కరీంనగర్ జిల్లా లోనే బస చేయనున్నారు సీఎం కేసీఆర్. అలాగే…రేపు ఉదయం కరీంనగర్ జిల్లా లో దళిత బంధు పథకం పై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమీక్ష నిర్వహించనున్నారు. దళిత బంధు పథకం అమలు, హుజురాబాద్ ఉప ఎన్నికపై ఈ సమీక్ష లో సీఎం కేసీఆర్ చర్చించ నున్నట్లు సమాచారం అందుతోంది. కాగా ఇవాళ దళిత బంధు పథకం లో భాగంగా రూ . 500 కోట్లు విడుదల అయిన సంగతి తెలిసిందే.