టాలీవుడ్ డ్రగ్స్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. కెల్విన్ అరెస్ట్ ??

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఈ డ్రగ్స్‌ కేసులో ఈడీ అధికారులు కెల్విన్ పట్టుకుని వచ్చారు.. డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి కెల్విన్ ను ఇంటి నుంచి ఈడీ కార్యాలయానికి తీసుకుని వచ్చారు అధికారులు. ఇక మరోవైపు హీరో నందు దగ్గరనుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు ఈడీ అధికారులు. కెల్విన్ పట్టుకొని రావడం తో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంతేకాదు… నటుడు నందు, కెల్విన్ ను ఇద్దరిని కలిపి విచారిస్తోంది ఈడీ.

కెల్విన్ ఇచ్చిన స్టేట్మెంట్ తోటే టాలీవుడ్ నటీనటులకు నోటీసు ఇచ్చారు ఈడీ అధికారులు. ఈ కేసులో అతని ద్వారానే కూపీ లాగే ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. కాగా… టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. మొదట విచారణ కు దర్శకుడు పూరి జగన్నాథ్ హజరవగా ఆ తరవాత ఛార్మీ కౌర్ ఆ తరవాత రకుల్ ప్రీత్ సింగ్ విచారణ కు హాజరయ్యారు. ఇక ఈరోజు నందు ఈడి కార్యాలయం కు విచారణకు వచ్చారు. నిజానికి నందు ఈ నెల 20 న విచారణ కు హాజరు కావాల్సి ఉంది. కానీ ఈడి అధికారుల అనుమతి తో ఇవ్వాళ విచారణ కు హాజరయ్యాడు.