బ్రేకింగ్ :టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక ఆధారాలు..!

-

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. కోట్ల లో జరుగుతున్న డ్రగ్స్ దందా పై ఈడీ దృష్టి సాధించింది. విదేశాల నుండి ఎల్ఎస్డి,కొకైన్, హెరాయిన్ లాంటి మత్తు పదార్థాలను దిగుమతి చేసినట్టు దర్యాప్తులో తేలింది. ఒక గ్రామ్ కొకైన్ విలువ దాదాపు రూ. 10 వేలు ఉంటుందని గుర్తించింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన కెల్విన్ కు అమెరికాలోని చికాగోలో ఉన్న అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నట్టు నిర్ధారించింది. అమెరికా నుండి మత్తుమందులు దిగుమతి చేసుకున్నట్లు వెల్లడించింది.

డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేసినట్టు అంతర్జాలం నుండి డబ్బులు చెల్లించినట్లు వెల్లడించింది. కొరియర్ లో అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా నుంచి డ్రగ్స్ ను దిగుమతి చేసినట్టు నిర్ధారించింది. మూడు ప్రైవేట్ కొరియర్ సంస్థలతో పాటు తపాలా ద్వారా కూడా డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు. ఎక్కువగా బిట్ కాయిన్ రూపంలో చెల్లింపులు జరిగాయని సమాచారం. డ్రగ్స్ సరఫరా… వినియోగం వరకే ఎక్సైజ్ శాఖ దర్యాప్తు చేసింది. డ్రగ్స్ కొనుగోలు చేసి విదేశాలకు ఎంత డబ్బు మళ్ళించారు.. ఎలా చెల్లించారు లాంటి అంశాలపై ఈడీ దృష్టి సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news