టాలీవుడ్ టాప్ హీరోల బిగ్ ఫైట్

Join Our Community
follow manalokam on social media

టాలీవుడ్ టాప్ హీరోలు తమ అప్ కమింగ్ ఫిలింస్ తో అదరగొట్టడానికే డిసైడ్ అయిపోయారు.గతంలో మాదిరిగా ఏదో సింపుల్ గా కొట్టేసి వెళ్లిపోకుండా చేజింగ్ సీన్లు,రఫ్ ఫైట్లను తమ సినిమాల్లో జత చేస్తున్నారు.ఇప్పటికే మహేష్ ఒకనెల పాటు దుబాయ్ షెడ్యూల్ లో సాంగ్స్ ,సీన్స్ తో పాటు హాలీవుడ్ లెవెల్లో మతిపోగొట్టే యాక్షన్ పార్ట్ ను పూర్తి చేసుకున్నాడు. టాలీవుడ్ హీరోలంతా యాక్షన్ సీన్ లతో ఫుల్ ప్యాక్ అయిపోయారు.


మహేష్ యాక్షన్ సీన్స్ పూర్తి చేయడంతో మిగిలిన పవన్ ,ప్రభాస్ లు అటువైపుగా దంచికొట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. పవన్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ ఫిలింలో భారీ యాక్షన్ పార్ట్ ను షూట్ చేస్తున్నారు.దాదాపు 170 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సినిమాని నిర్మిస్తున్నారని తెలుస్తుంది.అయితే మరో వారం రోజులు పాటు జరిగే ఈ యాక్షన్ సీక్వెన్స్ ఇంటర్వెల్ పార్ట్ లో వస్తుందట.మొఘల్స్ కాలం నాటి ఫిక్షన్ కథతో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ ఫిలిం నార్త్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే తెరకెక్కుతుందని తెలుస్తుంది.

ఇక ఆదిపురుష్ గా ప్రభాస్ వచ్చే వారం నుంచి జాయిన్ అవుతున్నాడని తెలుస్తోంది.ముంబైలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్స్ లో ఈ షూటింగ్ నిర్వహిస్తారు.ఐతే ముందుగా ప్రభాస్ పాల్గొనే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించ నున్నారు.రామాయణం ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో సుమారు 500 కోట్ల బడ్జెట్టుతో నిర్మిస్తున్నారు.

 

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...