తెలుగు హీరోల కొత్త పాట్లు! హిట్స్ వచ్చేనా.!

-

ప్రస్తుతం సినిమా తీయటం కోసం  దర్శకులు నానా అవస్థలు పడుతున్నారు.  కార్తికేయ 2, కాంతారా సినిమాలు వసూళ్ల వర్షం కురిపించాయి.  ఇవన్నీ ముందుగా ఊహించి ఈ స్థాయిలో ఆడతాయని తీసిన సినిమాలు కాదు. ఆ మాటకొస్తే ఫలానా కథలో ఎంత దమ్ముందో ఆడుతుందో లేదో చెప్పే జడ్జ్ మెంట్ అతికొద్దిమందిలో మాత్రమే ఉంటుంది. కానీ ఏదో కొత్తగా ప్రయతించాలన్న తపన, ఎలా తీస్తే ఆడియన్స్ ని మెప్పించగలమో ఊహించే మేధాశక్తి ఉంటే దానికి వందల కోట్లు అవసరం లేదు.

క్రియేటివిటీ ఉంటే కాసిన్ని లక్షలతోనూ గ్రాఫిక్స్ అవసరం లేని విజువల్ వండర్స్ సృష్టించవచ్చు. కథలో దమ్ము ఉండాలే కాని భాషల హద్దులు లేకుండా పోయాయి. సినిమా ఏ భాష లో తీసినా, మనకు పరిచయం లేని ఆర్టిస్టులు ఉన్నా కంటెంట్ బాగుంటే చాలు లాభాలు మూటగట్టుకోవచ్చు. ఇక కరోనా తరువాత ప్రేక్షకుల ఆలోచనా విధానంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. సినిమా సూపర్ గా ఉంటేనే థియేటర్లు కు వెళ్లే పరిస్థితి ఏర్పడింది.

దీంతో అల్లు అర్జున్..యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ మహేష్ బాబు రామ్ వంటి టాప్ హీరోల తోపాటు మీడియం రేంజ్ హీరోలు, సీనియర్ హీరోలు కూడా మంచి కథల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. ప్రతి కథను హడావుడిగా వినటం కాకుండా మంచిగా టైమ్ కేటాయించి జాగర్తగా అంచనా వేస్తున్నారు.ఈ క్రమంలోనే తమ వద్దకు వచ్చే దర్శకులని ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ ని డిమాండ్ చేస్తున్నారట. అలాగే నార్మల్ మాస్ మసాలా సినిమాలను వద్దని మొహం మీదనే చెబుతున్నారట. ఈ పద్ధతి తో ఆయినా టాలీవుడ్ లో హిట్ శాతం పెరుగతుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version