డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ టాలీవుడ్‌ నటికి మాఫియా డాన్‌ తో లింకులు ?

టాలీవుడ్‌ నటి డ్రగ్స్ తో దొరికిపోయిన కేసు సంచలనంగా మారింది. సదరు నటికి మాఫియాతో లింకులు ఉన్నట్టుగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు గుర్తించారు. టాలీవుడ్‌ లో నాలుగు సినిమాలలో హీరోయిన్ గా నటించిన శ్వేతా కుమారి మాఫియా డాన్ కరీం లాలతో కలిసి డ్రగ్స్‌ బిజినెస్ చేస్తున్నట్టు ఎన్‌సీబీ అధికారులు గుర్తించారు. ఆమెను విచారించగా ఆమె ద్వారా వచ్చిన సమాచారం మేరకు తాజాగా బాంద్రా, కుర్ల, అందేరిలో జరిపిన దాడుల్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు..

మీరా రోడ్డులోని  హోటల్‌లో జరిపిన దాడిల్లో హీరోయిన్‌తో పాటు మరో ఇద్దరిని కూడా ఎన్‌సీబీ పట్టుకుంది.. వీరి వద్ద నుంచి 400 గ్రాముల డ్రగ్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. నటితో పాటు చాంద్, సయ్యద్ అనే ఇద్దరు పెడలర్స్ ను కూడా అరెస్ట్ చేసింది ఎన్‌సీబీ. ఇక మాఫియా డాన్ కరీం లాలా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దేశం విడిచి పారి పోకుండా ఉండేందుకు లూక్ ఔట్ నోటీసు జారీ చేసింది ఎన్‌సీబీ.