తెలంగాణ థియేటర్ ఎగ్జిబిటర్ల కు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ గిల్డ్ కౌంటర్ ఇచ్చింది. ప్రతి సినిమా పై పూర్తి హక్కు మరియు అధికారం ఒక నిర్మాతలకే ఉంటుందని ప్రొడ్యూసర్స్ గిల్డ్ పేర్కొంది. ఎక్కడ, ఎప్పుడు రిలీజ్ చేసుకోవాలో మరియు ఎవరికి సినిమా అనుకోవాలో అది నిర్మాత ఇష్టమని.. థియేటర్ ఎగ్జిబిటర్ లకు చురకలు అంటించింది. అసలు సినిమా అనేది మొదలయ్యేది నిర్మాత వల్లనేనని గుర్తు పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చింది.
కొందరు బహిరంగ విమర్శలు చేయడం సరికాదని పేర్కొంది ప్రొడ్యూసర్స్ గిల్డ్. నిర్మాతలకు హెల్ప్ అయ్యే విధంగా ఎగ్జిబిటర్లు ఉండాలని చాలా సార్లు విజ్ఞప్తి చేశామని గిల్డ్ గుర్తు చేసింది. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కలిసి ఉంటేనే…. తెలుగు చిత్ర పరిశ్రమ బాగుంటుందని ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ అభి ప్రాయపడింది. కాగా హీరో నాని హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమా ను ఓటీటీ లో విడుదల చేయడం పై థియేటర్ ఎగ్జిబిటర్లు సీరియస్ అయిన సంగతి తెలిసిందే.