రీసెంట్‌గా ప్రముఖ రచయత నటుడు గొల్లపూడి మారుతిరావు కాలం చేసి వారం కూడా కాలేదు. అపుడే టాలీవుడ్‌లో అలీ ఇంట్లో మరో విషాదకరణ ఘటన చోటుచేసుకుంది. అలీ మాతృమూర్తి జైతన్ బీబీ (75) అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. రాజమండ్రిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.41కి మరణించారు. అలీ ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ నిమిత్తం రాంచీలో ఉన్నారు. తల్లి మరణవార్త తెలుసుకున్న అలీ హుటాహుటినా హైదరాబాద్ బయలు దేరారు.
మరోవైపు అలీ తల్లి జైతున్ బీబీ పార్ధివ దేహాన్ని హైదరాబాద్ తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు అలీ బంధువులు. ఈ రోజు సాయంత్రం అలీ తల్లి అంత్య క్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా, అలీకి కన్నతల్లిపై ఉన్న ప్రేమను పలు సందర్భాల్లో గుర్తు చేసుకునేవారు. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే తల్లిదండ్రులే కారణం అని ఎపుడు చెబుతూ ఉండేవారు.