మాస్ మాయలో పడ్డ టాలీవుడ్ కుర్ర హీరోలు

-

తెలుగు సినీ పరిశ్రమలో కుర్రహీరోలందరు మాస్ లుక్ కోసం ఎంతగానో తపిస్తున్నారు.కాకపోతే వారెవరికి అనుకున్నంత వీజీగా ఇమేజ్ అయితే వచ్చిపడడం లేదు.అయినప్పటికీ వాళ్లనుకుంటున్న మాస్ లుక్ వారికి వచ్చేయాలంటున్నారు.మరి అంతలా మాస్ లుక్ కోసం పట్టబడుతున్న కుర్రహీరోల పై టాలీవుడ్ లో ఇంట్రస్టింగ్ చర్చ నడుస్తుంది.

టాలీవుడ్ సినీ ప్రియులు మాస్ హీరోలకు కాస్త ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు.అలా ఎవరైతే ప్రేక్షకుల నుంచి ఆ అభిమానాన్ని ఎక్కువగా రిసీవ్ చేసుకున్నారో వారు టాప్ హీరోలుగా మారతారు.చిరంజీవి,బాలయ్య,పవన్ ,మహేష్ ,తారక్ లు అలా స్టార్ డమ్ తెచ్చుకున్నవారే.ఒక్క మాస్ మంత్రం ఎలాంటి హీరోనైనా టాప్ పొజిషన్ కు తీసుకుపోయి కూర్చోబెడుతుంది.

తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది కుర్రహీరోలు అలా మాస్ ట్రైల్స్ వేస్తున్నవారే.కాకపోతే ఎవరికి అనుకున్నంత వీజీగా మాస్ హిట్లు వచ్చిపడిపోవడం లేదు.రీసెంట్ గా హీరో అఖిల్ తన అప్ కమింగ్ ఫిలిం కోసం మాస్ లుక్ లో మెరవడానికి చూస్తున్నాడని పరిశ్రమలో టాక్ నడుస్తుంది.అందుకు తగ్గట్లుగానే ట్రైన్ అవుతున్నాడని త్వరలో ఆ లుక్ రాబోతుందని చెబుతున్నారు.

లుకింగ్ వైజ్ అఖిల్ క్యూట్ హీరోగా ఉంటాడు.అలాంటి లుక్ ఉన్న హీరోకి మాస్ ఇమేజ్ రావడం అప్పుడే సాధ్యపడకపోవచ్చు.కమింగ్ ఫ్యూచర్ అది పాజిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది.అలాగే విజయ్ దేవరకొండ,నితిన్,నిఖిల్ ,రామ్ లు ఈ మాస్ ఇమేజ్ కోసమే గత కొన్నేళ్లుగా ట్రై చేస్తున్నారు.రౌడీస్టార్ కు ఆ ఆమేజ్ అప్పుడే వచ్చేసింది.అయితే దానిని నిలబెట్టుకోవాలి.ఇక నితినర్ ,నిఖిల్ ,రామ్ లలో ఆ యాంగిల్ జస్ట్ రామ్ కు మాత్రమే సాధ్యపడింది.కెరియర్ స్టార్టింగ్ నుంచి మాస్ యాంగిల్లోనే తనని బిల్డప్ చేసుకున్నాడు.దీంతో అది ఈఇస్మార్ట్ హీరోకి ఈజీ అయిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version