సక్సెస్‌ వచ్చినా ఆ దర్శకులకు తప్పని ఎదురుచూపులు

-

ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్స్‌ని ఎవ్వరు పట్టించుకోరు, సక్సెస్‌లో ఉన్న డైరెక్టర్స్‌ని అస్సలు విడిచిపెట్టరని ఇండస్ట్రీ టాక్. కానీ ఈ మధ్య సక్సెస్‌లో ఉన్న డైరెక్టర్స్‌కి కూడా గ్యాప్ వస్తోంది. సూపర్‌ హిట్‌ తర్వాత మరో సినిమా చెయ్యడానికి చాలా టైమ్‌ తీసుకుంటున్నారు దర్శకులు. మరి వాళ్లకి గ్యాప్‌ ఎందుకొస్తోంది…

వెంకీ కుడుముల రెండు సినిమాలు చేస్తే, రెండూ సూపర్‌ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ‘ఛలో, భీష్మ’ సినిమాలతో యూత్‌, ఫ్యామిలీస్‌ ఇద్దరినీ కవర్‌ చేస్తాడనే ఇమేజ్‌ కూడా వచ్చింది. అయితే ఇంత పాజిటివ్‌ రెస్పాన్స్ రెచ్చుకున్న వెంకీ కుడుముల ఇంకా నెక్ట్స్‌ సినిమా కన్ఫర్మ్ చెయ్యలేదు.

‘భీష్మ’ సినిమా రిలీజై ఏడాది దాటింది. ఈ గ్యాప్‌లో లాక్‌డౌన్‌లు, అన్‌లాక్‌లు, వ్యాక్సిన్లు అన్నీ వచ్చాయి. కానీ వెంకీ కుడుముల మాత్రం మరో సినిమా స్టార్ట్ చెయ్యలేదు. మహేశ్ బాబుతో సినిమా చేస్తాడని, రామ్‌ చరణ్‌కి కథ చెప్పాడని, రామ్‌తో డిస్కషన్స్ జరుగుతున్నాయని చాలా వార్తలు వినిపించాయి. కానీ ఒక్క ప్రాజెక్ట్‌ కూడా కన్ఫర్మ్ కాలేదు.

‘కలర్‌ఫోటో’ సినిమాకి ఓటీటీలో సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. చిన్న సినిమాగా రిలీజై భారీగా ప్రశంషలు అందుకుంది. డైరెక్టర్ సందీప్‌ రాజ్‌కి కూడా మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఈ సక్సెస్‌ తర్వాత సందీప్ ఇంకా నెక్ట్స్‌ సినిమా అనౌన్స్‌ చెయ్యలేదు.

సూపర్ హిట్‌ డైరెక్టర్స్‌తో సినిమాలు చెయ్యడానికి హీరోలు, ప్రొడ్యూసర్లు ఎప్పుడూ రెడీగానే ఉంటారు. కానీ డైరెక్షన్‌ చెయ్యడానికి కథలు లేకపోతేనే కష్టం. స్టోరీ బ్యాంక్‌ ఉన్నోళ్లు వెంట, వెంటనే సినిమాలు చేస్తుంటారు. కానీ ఒక కథ అయిపోయాకే మరో కథ అనుకునేవాళ్లకి కొంచెం గ్యాప్ వస్తోంది.

‘ఆకాశమే నీ హద్దురా’ సినిమా ఓటీటీలో రిలీజైనా, 70 ఎమ్.ఎమ్. రేంజ్‌లో హంగామా చేసింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అనే తేడా లేకుండా అన్ని పరిశ్రమల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సుధా కొంగర డైరెక్షన్‌ అద్భుతమని కాంప్లిమెంట్స్‌ ఇచ్చారు జనాలు. అయితే ఇన్ని ప్రశంషలు వచ్చినా, సుధ కొంగరకి మాత్రం గ్యాప్ వస్తోంది.

సుధా కొంగర ‘ఆకాశం నీ హద్దురా’ తర్వాత భారీ సినిమా ప్లాన్ చేస్తుందనే టాక్ వచ్చింది. కార్తీతో డిస్కషన్స్‌ జరుగుతున్నాయని కొన్నాళ్లు, విజయ్‌తో సినిమా చేస్తుందని మరికొన్నాళ్లు, ఆ తర్వాత అజిత్‌తో మూవీ కన్ఫర్మ్ అయ్యిందనే టాక్ వచ్చింది. వీటితోపాటు మహేశ్ బాబు కోసం ఒక స్టోరీ రెడీ చేస్తుందనే టాక్ కూడా వచ్చింది. కానీ వీటిల్లో ఒక్క సినిమా కూడా స్టార్ట్ కాలేదు.

‘మిడిల్‌క్లాస్‌ మెలొడీస్’ సినిమాతో హీరో ఆనంద్‌ దేవరకొండకి ఫస్ట్‌ హిట్ ఇచ్చాడు దర్శకుడు వినోద్ అనంతోజు. ఓటీటీలో సూపర్‌ రెస్పాన్స్‌ తెచ్చుకున్న ఈ మూవీ తర్వాత ఆనంద్‌ కెరీర్‌కి కూడా బూస్టప్ వచ్చింది. ‘పుష్పక విమానం’ లాంటి సినిమాలు చేస్తున్నాడు. అయితే వినోద్ అనంతోజు మాత్రం ఇప్పటివరకు మరో సినిమా స్టార్ట్ చెయ్యలేదు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news