టమాటా ధ‌ర ఢ‌మాల్…కిలో 30 రూపాయ‌లే..!

ట‌మాటా ధ‌ర‌లు భారీగా పెరిగిపోయిన సంగ‌తి తెలిసిందే. ఏకంగా కిలో వంద‌రూపాయ‌లు ప‌లికింది. దాంతో అన్ని కూరగాయల కంటే టామాటానే ఫిరం అయ్యింది. ఈ నేప‌థ్యంలో సామాన్యులు ఆందోళ‌న చెందారు. అయితే రాత్రికి రాత్రే ట‌మాటా ధ‌ర‌లు ఢ‌మాల్ అయ్యాయి. క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ మార్కెట్ లో కిలో ట‌మాటా ధ‌ర రూ.100 ఉండ‌గా రాత్రికి రాత్రే రూ.30కి ప‌డిపోయింది.

ట‌మాటా ధ‌ర‌లు పెర‌గ‌టంతో మ‌ధ్య‌ప్ర‌దేశ్ మ‌రియు మ‌హ‌రాష్ట్ర నుండి ట‌మాటా దిగుమ‌తులు పెరిగాయి దాంతో ట‌మాటా ధ‌ర‌లు ప‌డిపోయాయి. ఇక ధ‌రలు ప‌డిపోవ‌డంతో ట‌మాటా రైతులు ఆందోళ‌న చెందుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ట‌మాటా ధ‌ర‌లు ఇంకా త‌గ్గుముకం ప‌ట్ట‌లేదు. కిలో రూ.55 నుండి రూ.60 ప‌లుకుతున్నాయి. ఇక ట‌మాటా కొంటే బిర్యానీ ఫ్రీ..టమాటా కంటే చికెన్ కొన‌డం బెటర్ అంటూ ట‌మాటా పై జోకులు పేలిన సంగ‌తి కూడా తెలిసిందే.