ఏపీలో బీటెక్ విద్యార్థి దారుణ హ‌త్య‌..ఆపై..!

ఏపీలో దారుణం చోటుచేసుకుంది. ఓ బీటెక్ విద్యార్థిని హ‌త‌మార్చి త‌గ‌ల‌బెట్టారు. ఈ ఘ‌ట‌న క‌ర్నూలు జిల్లాలోని కావ‌లి రూర‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. చ‌నిపోయిన విద్యార్థికాంచ‌ర్ల రాంచంద‌ర్ గా పోలీసులు గుర్తించారు. టోల్ గేట్ నుండి తుమ్మ‌ల కుంట వెళ్లే దారిలో హైవేప‌క్క‌న చెట్ల పొద‌ల్లో గుర్తుతెలియ‌ని కాలిపోయ‌న శ‌వం కనిపించింది.ఈ విషయాన్ని వాహ‌నదారులు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు.

crime news adhrapradesh
crime news adhrapradesh

దాంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు స‌గం కాలిపోయిన సెల్ ఫోన్ ఇత‌ర వ‌స్తువుల ఆధారంగా అత‌డు వింజ‌మూరుకు చెందిన కాంచ‌ర్ల రాంచంద‌ర్ గా గుర్తించారు. కావ‌లి విట్స్ కాలేజీలో రాంచంద‌ర్ బీటెక్ మూడో సంవ‌త్స‌రం చ‌దువుతున్నాడు. గురువారం ఉద‌యం తాను కాలేజీకి వెళుతున్న‌ట్టు చెప్పిరాంచంద‌ర్ తిరిగి రాలేదు. ఇక రాంచందర్ మృత‌దేహాన్ని గుర్తించిన పోలీసులు త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం అందించారు. ఈ ఘ‌ట‌న‌ను అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ జ‌రుపుతున్నారు.