నిర్భయ దోషులను రేపు ఉరి తీయడ౦ ఖాయంగా కనపడుతుంది. ముఖేష్ కుమార్, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తా లను కోర్ట్ ఉరి తీయాలని డెత్ వారెంట్ లు జారీ చేసిన సంగతి తెలిసిందే. వాళ్ళను మార్చ్ 20 ఉదయం 5 గంటలకు ఉరి తీయాలని కోర్ట్ ఆదేశించింది. దీనితో ఇప్పటికే కోర్ట్ లో ఏర్పాట్లు కూడా పూర్తి చేసారు అధికారులు. తలారి కూడా జైలు కి చేరుకొని ఉరి తీయడానికి సిద్దమయ్యారు.
ఇప్పటికే దోషులకు అన్ని విధాలుగా రాజ్యాంగ, న్యాయ హక్కులు పూర్తి అయ్యాయి. కుటుంబ సభ్యులను కూడా వాళ్ళు కలిసారు. దీనితో రేపు వారిని ఉరి తీయడం దాదాపుగా ఖాయమే అంటున్నారు. తాజాగా మరణ శిక్షను జీవిత ఖైదు గా మార్చాలని దోషి పవన్ గుప్తా పెట్టుకున్న పిటీషన్ ని కోర్ట్ కొట్టేసింది. అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళినా సరే వాళ్లకు మాత్రం విముక్తి లభించలేదు.
కుటుంబ సభ్యులు కూడా కారుణ్య మరణాలకు అనుమతించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి కూడా పెట్టుకున్నారు. ఇక దోషుల్లో ఒకరైన ముఖేష్ కుమార్ సింగ్ భార్య బీహార్ లో ఒక కోర్ట్ ని ఆశ్రయించారు. తన భర్త నుంచి తనకు విడాకులు ఇప్పించాలని ఆమె కోరారు. దానిని కూడా కోర్ట్ పరిగణలోకి తీసుకోలేదు. కాగా వీరికి ఇప్పటికే మూడు సార్లు ఉరి అమలు చెయ్యాలని డెత్ వారెంట్ లు జారీ చేసింది.