కేజీఎఫ్‌2: రికార్డుల వేట.. తుఫాన్‌ వీడియో సాంగ్‌ విడుదల..

-

చలనచిత్ర పరిశ్రమలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది కేజీఎఫ్‌ చాప్టర్‌2 సినిమా. అయితే ఈ సినిమా మొదటి భాగంకు అనుహ్య స్పందన రావడంతో ఈ చిత్రం రెండవ భాగాన్ని పాన్‌ ఇండియా లెవెల్‌లో రిలీజ్‌ చేశారు చిత్రయూనిట్‌. అనుకున్నట్లుగానే ఈ సినిమా అన్ని భాషాల్లో బాక్సీఫీస్‌ వద్ద భారీ వసూల్లు రాబడుతోంది. ఇటీవ‌లే ఈ చిత్రం 1200కోట్ల మార్క్‌ను అధిగ‌మించి రికార్డు సృష్టించింది. మ‌రీ ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ చిత్రం స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసింది. కలెక్ష‌న్ల‌లో ఖాన్‌, క‌పూర్‌ల‌ను సైతం వెన‌క్కి నెట్టి రాఖీ బాయ్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు.

toofan - Twitter Search / Twitter

చిత్రం విడుద‌లై నెల రోజులు దాటిన‌ క‌లెక్ష‌న్లలో మాత్రం జోరు త‌గ్గ‌డం లేదు. అయితే.. ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో నుంచి తుఫాన్ అంటూ సాగే పాట వీడియో సాంగ్‌ను విడుదలకు రంగం సిద్ధమైంది. థియేట‌ర్లో ర‌చ్చ లేపిన ‘తుఫాన్’ వీడియో సాంగ్‌ను బుధ‌వారం ఉద‌యం 11.00 గంట‌లకు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం వెల్ల‌డించింది. ఇప్ప‌టికే విడుద‌లైన ‘ఎద‌గ‌రా’, ‘మెహ‌బూబా’ వీడియో పాట‌లు యూట్యూబ్‌లో మిలియ‌న్ల వ్యూస్‌ను సాధించాయి.

Read more RELATED
Recommended to you

Latest news