ప్రస్తుతం మనకు మార్కెట్‌లో అనేక రకాల మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో అందించే ఫీచర్లను బట్టి ఎవరైనా సరే.. తమకు ఇష్టమైన, తమకు నచ్చిన ఫోన్లను కొంటుంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో ఆండ్రాయిడ్ ఫోన్లకు ఎంత డిమాండ్ ఉందో, ఐఫోన్లకు కూడా అంతే డిమాండ్ ఉంది. ఐఫోన్లను ఆపిల్ సంస్థ తయారు చేస్తే.. పలు రకాల మొబైల్ తయారీ సంస్థలు ఆండ్రాయిడ్ ఫోన్లను తయారు చేస్తున్నాయి. అయితే వీటన్నింటిలో ప్రపంచ వ్యాప్తంగా ఏ కంపెనీలకు చెందిన ఫోన్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయో తెలుసా..? ఆ టాప్ 5 కంపెనీల గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
1. శాంసంగ్
ప్రపంచ మొబైల్ ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్‌ది 20 శాతం వాటా. దక్షిణ కొరియాకు చెందిన ఈ కంపెనీ ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఫోన్లను విక్రయిస్తోంది. ఈ కంపెనీయే అన్నింటికన్నా టాప్ ప్లేసులో కొనసాగుతోంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఈ కంపెనీ 59 మిలియన్ల ఫోన్లను డెలివరీ చేసింది.
2. హువావే
ప్రపంచ మొబైల్ ఫోన్ మార్కెట్‌లో 17 శాతం వాటాతో ఈ కంపెనీ రెండో స్థానంలో కొనసాగుతోంది. 2020 మొదటి త్రైమాసికానికి ఈ కంపెనీ 49 మిలియన్ల ఫోన్లను డెలివరీ చేసింది.
3. ఆపిల్
ఐఫోన్లను తయారు చేసే ఆపిల్ సంస్థ ప్రపంచ మొబైల్ ఫోన్ మార్కెట్‌లో 3వ స్థానంలో ఉంది. ఈ కంపెనీ వాటా ప్రపంచ మార్కెట్‌లో 14 శాతంగా ఉంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆపిల్ మొత్తం 40 మిలియన్ల ఐఫోన్లను డెలివరీ చేసింది.
4. షియోమీ
ఈ సంస్థ భారత మొబైల్ ఫోన్ మార్కెట్‌లో నంబర్ వన్ స్థానంలో ఉన్నా.. ప్రపంచ మార్కెట్‌లో మాత్రం 4వ స్థానంలో ఉంది. ప్రపంచ మార్కెట్‌లో ఈ కంపెనీ వాటా 10 శాతంగా ఉంది. తొలి త్రైమాసికంలో ఈ కంపెనీ 29.7 మిలియన్ల ఫోన్లను డెలివరీ చేసింది.
5. ఒప్పో
ప్రపంచ మొబైల్ ఫోన్ మార్కెట్‌లో ఒప్పో 5వ స్థానంలో కొనసాగుతోంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఈ కంపెనీ 22.3 మిలియన్ల ఫోన్లను డెలివరీ చేసింది.
ఇక ఇవే కాకుండా వివో, రియల్‌మి, లెనోవో, ఎల్‌జీ, టెక్నో కంపెనీలు వరుసగా 6, 7, 8, 9, 10 స్థానాల్లో నిలిచాయి.