వామ్మో.. ఎంత పెద్ద విగ్రహాలు.. ప్రపంచంలోనే అత్యంత పెద్ద విగ్రహాలట..

-

సాధారణంగా మనం మామూలు విగ్రహాలను చూసి ఉంటాం. కానీ.. చాలా పొడవైన, పెద్ద విగ్రహాలను ఎక్కడైనా చూశారా? అవి ప్రపంచంలోనే అత్యంత పెద్దవి మరి.

అసాధారణంగా ఉన్న ఏదైనా మనకు వింతే. అదో అద్భుతం. మనుషుల్లోనూ అందరిలా కాకుండా డిఫరెంట్ గా ఉండేవాడి మీదనే అందరికీ ఆసక్తి. అదేదో సినిమాలో మహేశ్ బాబు ఓ పాట పాడుతాడు చూడండి.. నిండు చందురుడు ఒకవైపు.. చుక్కలు ఒకవైపు.. నేను ఒక్కడిని ఒకవైపు.. లోకం ఒకవైపు.. అంటాడు కదా.. సేమ్ టు సేమ్ అలాగే అన్నమాట.

సాధారణంగా మనం మామూలు విగ్రహాలను చూసి ఉంటాం. కానీ.. చాలా పొడవైన, పెద్ద విగ్రహాలను ఎక్కడైనా చూశారా? అవి ప్రపంచంలోనే అత్యంత పెద్దవి మరి. పదండి ఓసారి వాటిని చూసి తరిద్దాం.

ది మదర్ కాల్స్, రష్యా, 87 మీటర్లు


మీరు పైన చూస్తున్న ఆ విగ్రహం ఎత్తు ఎంతో తెలుసా? 87 మీటర్లు. ఆ విగ్రహం పట్టుకొని ఉన్న కత్తి పొడవే 33 మీటర్లు. ఆ విగ్రహం పేరు మదర్ కాల్స్ స్టాచ్యూ. 1942-1943 మధ్య కాలంలో ఆ విగ్రహాన్ని నిర్మించారు. రష్యాలోని ఇండస్ట్రియల్ సిటీలో దీన్ని నిర్మించారు.

గ్రాండ్ బుద్ధ – చైనా


చైనాలోనే అతి పెద్ద బుద్ధుడి విగ్రహం ఇది. లాంగ్ షాన్ పర్వతాల్లో ఉంది ఇది. 88 మీటర్ల ఎత్తు ఉంటుంది ఈ విగ్రహం. 700 టన్నుల బరువు ఉండే ఈ విగ్రహాన్ని కంచుతో తయారు చేశారు.

గ్రేట్ బుద్ధ – థాయిలాండ్


థాయిలాండ్ లో ఉన్న ఈ గ్రేట్ బుద్ధ విగ్రహం కూడా థాయిలాండ్ లో అతి పెద్ద విగ్రహం. 92 మీటర్ల ఎత్తు ఉంటుంది. 1990 లో దీని నిర్మాణం ప్రారంభించి 2008 లో పూర్తి చేశారు. దీన్ని సిమెంట్ తో కట్టి గోల్డెన్ ప్లేట్ తో కోటింగ్ వేశారు.

పీటర్ ది గ్రేట్ స్టాచ్యూ – రష్యా


రష్యా చక్రవర్తి పీటర్ జ్ఞాపకార్థం ఈ విగ్రహాన్ని నిర్మించారు. పీటర్ చక్రవర్తి రష్యాను 43 సంవత్సరాలు పాలించారు. ఈ విగ్రహం ఎత్తు 98 మీటర్లు. మాస్కోలో మోస్క్వా నది వైపుకు ఉంటుంది. ఈ విగ్రహం 100 టన్నుల బరువు ఉంటుంది.

రొడినా మాట్ (102 మీటర్లు)


రొడినా మాట్ విగ్రహం కైవ్ లో ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దాన్ని నిర్మించారు. ఆ విగ్రహాన్ని స్టీల్ తో తయారు చేశారు.

క్రిస్టో రై (110 మీటర్లు)


1959 లో ఈ విగ్రహాన్ని నిర్మించారు. రియో డె జనైరో విగ్రహాన్ని పోలి ఉంటుంది ఇది. కాకపోతే వీటి పొడవే తేడా. దీని పొడవు 110 మీటర్లు.

Read more RELATED
Recommended to you

Exit mobile version