మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ కమిషనర్.. రోడ్డుపై ఓవ్యక్తికి సీపీఆర్‌ చేసి

-

గుండెపోటు.. జనాలను భయపెడుతోంది. ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎప్పుడు వస్తుందో తెలియదు.. సడెన్ గా అటాక్ చేస్తుంది. రెప్పపాటులో ప్రాణాలు తీస్తోంది. చిన్న, పెద్ద తేడా లేదు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారికి సైతం సడన్ గా గుండెపోటు వస్తుంది. అయితే, సరైన సమయంలో వెంటనే చికిత్స అందిస్తే ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ, ఏ మాత్రం చికిత్స ఆలస్యం అయినా మరణం తధ్యం.

అయితే , బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వద్ద ఓ వ్యక్తి కిందపడిపోగా నార్త్ జోన్ ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, ట్రాఫిక్ కానిస్టేబుల్ బాలయోగి తదితరులు ఆయనకు సీపీఆర్ చేసి కాపాడారు. ఆ తర్వాత వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. బుధవారం బేగంపేటలో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతనికి గుండెపోటు రావడంతో రోడ్డు మీద పడిపోయాడు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ అధికారి మధుసూదన్ రెడ్డి అతనిని గమనించి సీపీఆర్ చేశారు. ఆయనకు ట్రాఫిక్ కానిస్టేబుల్ సహాయం చేశారు. ఆ తర్వాత బాధితుడిని అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించిన ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version