గంజాయి, సారాయి, ఇసుక, మట్టి అక్రమ రవాణా చేసేవారిని వదలిపెట్టేది లేదు: నగరి ఎమ్మెల్యే

-

‘ఇక్కడ ఉన్నది రోజా కాదు…భాను’ అంటూ అధికారులపై నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మండిపడ్డారు. పుత్తూరు మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న గాలి భాను ప్రకాష్ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు.ప్రభుత్వం మారిందని, అలవాట్లు కూడా మారాలని నిజాయితీగా, బాధ్యతగా పని చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రజల సంక్షేమం, అభివృద్దే సీఎం చంద్రబాబు లక్ష్యమని, శాంతి భద్రతలు కాపాడాలని, ప్రజలు ప్రశాంతంగా జీవించాలని తెలిపారు. అధికారులు తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు . మంచికి మంచి, చెడుకు చెడు, నాటకాలు ఆడితే సహించేది లేదని అన్నారు.

చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహారించాలని ,గంజాయి, సారాయి, ఇసుక, మట్టి అక్రమ రవాణా చేసేవారిని వదలిపెట్టేది లేదనితెలిపారు. ఎన్నికల సమయంలో అక్రమ మద్యం వేల కేసులు బయటపడ్డాయని, అన్నింటిపై విచారణ చేయిస్తామని తెలిపారు. ప్రభుత్వ భూముల కబ్జాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని , ప్రజా సంక్షేమం కోసం పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు.జూలై 1 నాటికి అవ్వతాతలకు రూ.7 వేలు పింఛన్లు ఇవ్వడం జరుగుతుందని నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news