భారత సరిహద్దుల్లో విషాద ఘటన జరిగింది. భారత సైనికుడు ఒకరు ప్రమాదవ శాత్తు పాకిస్తాన్ భూభాగంలోకి జారిపోయారు. వివరాల్లోకి వెళితే డెహ్రాడూన్‌లోని అంబీవాలా సైనిక కాలనీకి చెందిన రాజేంద్ర సింగ్ నేగి 2002 లో భారత ఆర్మీలో జాయిన్ అయ్యారు. ఇటీవల కాశ్మీర్ లో శీతల ప్రాంతం అయిన గుల్మార్గ్ కు ఆయన్ను అధికారులు బదిలీ చేసారు. విధులు నిర్వహిస్తున్న క్రమంలో నేగి,
మంచులో నడుస్తూ పొరపాటున ఉన్నట్టుండి, జారిపోయి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళిపోయారు. దీనితో జనవరి 8న ఆయన కనపడటం లేదని అధికారులు ఆయన భార్యకు సమాచారం అందించారు. ప్రమాదవ శాత్తు ఈ ఘటన జరిగిందని తమకు ఆలస్యంగా సమాచారం అందిందని ఆయన భార్యకు చెప్పారు. భారత సరిహద్దును దాటి పాక్ భూభాగంలోకి వెళ్లిపోయారని వారు వివరించారు.
దీనితో ఆందోళనకు గురవుతున్న నేగీ కుటుంబ సభ్యులు ఏ విధంగా అయినా సరే ఆయనను భారత్ తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను కుటుంబ సభ్యులు వేడుకున్నారు. అయితే ఆయన పాక్ ఆర్మీకి చిక్కారా లేదా అనేది స్పష్టత రావడం లేదు. ఈ నేపధ్యంలో అధికారులు అతని ఆచూకి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అటు పాకిస్తాన్ ఆర్మీ నుంచి కూడా నేగీ కి సంబంధించిన వివరాలు ఏమీ తెలియలేదు.