ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వరుసగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో మనిషి జీవించడం అనేది ఒక సవాలుగా మారిపోయింది.. ఎవరు ఎప్పుడు ఎలా చనిపోతారో తెలియకుండానే జీవితాలు కూడా ముగిసిపోతున్నాయి.. గంట ముందు వరకు అంతా ఓకే అనుకున్న ప్రాణాలు కూడా గంట తర్వాత తలకిందులు అవుతున్నాయని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా అంతులేని కష్టాలు , బాధలు, వ్యాధుల మధ్య జీవితమే కష్టం అయిపోయింది.. ఇక సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఇందుకు అతీతం కాదు అని చెప్పవచ్చు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ కూడా చాలామంది నటులను కోల్పోయింది. ఇక ఈ క్రమంలోనే తాజాగా టెలివిజన్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి విషాదఛాయలు అలుముకున్నాయి.
ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు, జబర్దస్త్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన కమెడియన్ మూర్తి ఈరోజు మధ్యాహ్నం కన్నుమూశారు. ఇక ఈ విషయాన్ని ఆయన సోదరుడు అరుణ్ స్వయంగా మీడియాతో దృవీకరించడం జరిగింది. జబర్దస్త్ కమెడీయన్ గా మిమిక్రీ మూర్తి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.. ఇక జబర్దస్త్ ఒకటే కాదు ఎన్నో వేదికల పైన అనేక ప్రదర్శనలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మూర్తి గత కొన్ని సంవత్సరాలుగా ప్యాంక్రియాస్ క్యాన్సర్ అనే వ్యాధితో బాధపడుతున్నారు.. ఆయన ప్రతిరోజు తీసుకునే మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ చూపించడంతో హనుమకొండలో ఈరోజు మధ్యాహ్నం కన్ను మూసినట్లు సమాచారం.
ఇకపోతే క్యాన్సర్ కారణంగా ఆయన అనారోగ్యానికి గురి అయ్యారు. కేవలం మూడు సంవత్సరాల లోని తన వైద్యం కోసం సుమారు రూ.16 లక్షల ఖర్చు పెట్టారని సమాచారం. అయినప్పటికీ కూడా లాభం లేకపోయింది.. గతంలో మూర్తిని కాపాడడానికి సుమన్ టీవీ కూడా తన వంతు సహాయాన్ని అందించింది. అంతేకాదు కొంతమంది దాతలు కూడా మూర్తికి అండగా నిలిచారు. కానీ అప్పటికే పరిస్థితి చేయి జారిపోవడంతో మరణం ఆయనను ఆవహించింది. ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు.