Breaking : ఎంజీఎంలో సూప‌రింటెండెంట్‌పై బ‌దిలీ వేటు.. మ‌రో ఇద్ద‌రు వైద్యులు స‌ప్పెన్షన్

-

హైద‌రాబాద్ లోని ఎంజీఎం ఆస్ప‌త్రి సూప‌రింటెండ్ కు అధికారులు షాక్ ఇచ్చారు. ఎంజీఎం సూప‌రింటెండ్ పై బ‌దిలీ వేటు వేశారు. అలాగే విధుల్లో ఉన్న మ‌రో ఇద్ద‌రు వైద్యులను అధికారులు స‌ప్పెన్షన్ చేశారు. కాగ ఎంజీఎం ఆస్పత్రిలో ఆయా వైద్యులు.. విధుల్లో నిర్ల‌క్ష్యం గా వ్య‌వ‌హ‌రించారు. కాగ దీని పై తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం సీరియ‌స్ గా ఉంది. తెలంగాణ నుంచి కాకుండా.. దేశంలో ప‌లు ప్రాంతాల్లో నుంచి కూడా ఎంజీఎం ఆస్ప‌త్రికి రోగులు వ‌స్తారు.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంజీఎం ఆస్ప‌త్రికి చాలా పేరు ఉంది. అయితే ఇంత మంచి పేరు ఉన్న ఎంజీఎం ఆస్ప‌త్రిలో విధులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించడం పై తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం సీర‌య‌స్ అయింది. దీంతో విధుల్లో నిర్ల‌క్ష్యం వహించినా.. ఇద్ద‌రు వైద్యుల‌ను స‌స్పండ్ చేస్తు రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అలాగే సూప‌రింటెండ్ పై బ‌దిలీ వేటు వేసింది. దీంతో గ‌తంలో సూప‌రింటెండ్ గా ఉన్న చంద్ర శేఖ‌ర్ కు సూప‌రింటెండ్ బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

Read more RELATED
Recommended to you

Latest news