తెలంగాణలో ఆరుగురు IAS అధికారులు బదిలీ

-

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త కొత్త మార్పులను తీసుకొస్తుంది. ముఖ్యంగా కీలక అధికారులందరినీ మార్పులు, చేర్పులు చేస్తుంది. పాలన పరంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక మార్పులు తీసుకొస్తున్నారు. ప్రతీ విషయంలో కూడా మార్పులుంటేనే అభివృద్ధి సాధించవచ్చనే విధంగా మార్పులు తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

 

తెలంగాణలో  ప్రస్తుతం అధికారుల బదిలీ ప్రక్రియ కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. తాజాగా మరో ఆరుగురు ఐఏఎస్‌లు, ఓ ఐపీఎస్ అధికారిని బదిలీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎస్ శాంతి కుమారి ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.

  • ట్రాన్స్ ఫోర్ట్ కమిషనర్ గా జ్యోతి బుద్ధా ప్రకాశ్
  • ఏక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కమిషనర్ గా శ్రీధర్
  • రంగారెడ్డి కలెక్టర్ భారతి హోలీ కెరీపై బదిలీ వేటు (పోస్టింగ్ ఇవ్వలేదు)
  • రంగారెడ్డి కలెక్టర్ గా గౌతమ్ పోర్ట్
  • ఇంటర్ బోర్డు డైరెక్టర్ గా శృతి హోజా
  • ట్రైబల్ ఫెల్ఫెర్ డైరెక్టర్ గా నర్సింహా రెడ్డి
  • సివిల్ సప్లై కమిషనర్ గా దేవేంద్ర సింగ్ చౌహన్

Read more RELATED
Recommended to you

Latest news