అంగ‌రంగ‌వైభ‌వంగా ట్రాన్స్ జెండ‌ర్ తో యువ‌కుడి పెళ్లి..!

ట్రాన్స్ జెండ‌ర్ ల‌కు కూడా సమాజంలో అంద‌రితో పాటు స‌మాన‌మైన గౌర‌వం ద‌క్కాల‌ని ఎంతోమంది కోరుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే చెన్నై లో ట్రాన్స్ జెండ‌ర్ కు అలాంటి గౌర‌వ‌మే ద‌క్కింది. ప్రేమించిన యువ‌కుడు పెద్ద‌ల‌ను ఒప్పించి మ‌రీ ట్రాన్స్ జెండర్ ను అంగ‌రంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు. త‌మిళ‌నాడు రాష్ట్రం క‌ల్ల‌కురిచి జిల్లా చింతాద్రిపేట కు చెందిన మ‌నో అనే యువ‌కుడు చెన్నైలో ఉద్యోగం చేస్తున్న స‌మ‌యంలో రియా అనే ట్రాన్స్ జెండ‌ర్ తో ప్రేమ‌లో ప‌డ్డాడు.

కొంత‌కాలం ప్రేమించికున్న వీరి జంట పెళ్లి చేసుకోవాల‌ని నిశ్చ‌యించుకున్నారు. ఈ విష‌యాన్ని మనో త‌న ఇంట్లో చెప్ప‌గా ట్రాన్స్ జెండ‌ర్ తో పెళ్లి ఏంటి ముందుగా అతడి త‌ల్లి దండ్రులు నిరాక‌రించారు. కానీ త‌న త‌ల్లితండ్రుల‌ను ఒప్పించి యువ‌కుడు ట్రాన్స్ జెండర్ రియాను వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి రాష్ట్రం న‌లుమూల‌ల నుండి పెద్ద ఎత్తున ట్రాన్స్ జెండర్ లు త‌ర‌లివ‌చ్చారు.