కేసీఆర్ సర్కార్ కు షాక్ ; పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు బ్రేక్‌

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దిమ్మ తిరిగే షాక్‌ తగిలింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కు ఎన్జీటీ బ్రేక్ వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి NGT లో చుక్కెదురైంది. పాలమూరు రంగా రెడ్డి ప్రాజెక్టు పనులు నిలిపి వేయాలని NGT ఆదేశాలు జారీ చేసింది.

ప్రాజెక్టు పనులు వెంటనే ఆపాలని.. ఆటవీ, పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టొద్దని ఎన్జీటీ చెన్నై బెంచ్‌ ఆదేశించింది. ఈ ప్రాజెక్టు పై ఏపీ ప్రభుత్వం పలు అభ్యంతరాలను లేవనెత్తింది. అయితే.. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వివరణతో ఎన్జీటీ సంతృత్తి చెందలేదు.  ఈ నేపథ్యంలోనే పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టవద్దని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది NGT. తమ ఆదేశాలను భే ఖాతరు చేస్తే… కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది ఎన్జీటీ. అయితే.. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news