కిడ్నీల ఆరోగ్యానికి ఈ డీటాక్స్‌ డ్రింక్స్ ట్రే చేయండి.!!

-

కిడ్నీల ఆరోగ్యం చాలా ముఖ్యమైన విషయం.. ఎలాంటి నొప్పిని అయినా అశ్రద్ధ చేయొచ్చు కానీ.. కిడ్నీల విషయంలో అశ్రద్ద చేస్తే అది మన ప్రాణానికే ప్రమాదం..రోజూ మనం తినే జంక్‌ఫుడ్స్‌, ఇతర విషపదార్థాలన్నింటిలో వ్యర్థాలను కిడ్నీలు చాలా జాగ్రత్తగా క్లీన్‌ చేస్తాయి. ఫిల్టర్‌ ఏజెంట్స్‌లా పని చేసే కిడ్నీలు ఫెయిల్‌ అయ్యాయి అంటే.. ఇక మన పని అయిపోయినట్లే.. మరి అలాంటి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు చెప్పుకోబోయో డ్రింక్స్‌ అప్పుడప్పుడు తాగుతూ ఉండండి..! దాంతో కిడ్నీల ఆరోగ్యం బాగుంటుందంటన్నారు నిపుణులు.

అల్లం – కొత్తిమీర- ఈ రెండింటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. కిడ్నీని ఆరోగ్యంగా ఉంచడానికి అల్లం, కొత్తిమీర మంచిదిగా పరిగణిస్తారు. దీనికోసం కొంచెం అల్లం, కొత్తిమీరను నీళ్లలో వేసి మరిగించాలి. ఈ కషాయం తీసుకోవడం ద్వారా కిడ్నీలను శుభ్రం అవుతాయి.

కొబ్బరి నీరు, యాలకులు- కొబ్బరి నీళ్లు ఎంత శ్రేష్టమైనవే అందరికీ తెలిసిన విషయమే.. యాలకులు తీసుకోవడం వల్ల శరీరంలోని బ్యాక్టీరియా నాశనం అవుతుంది. అందుకే నోటి నుంచి వచ్చే దుర్వాససన ఆగిపోతుంది. కొబ్బరి, యాలకుల కలయిక మూత్రపిండాలకు మేలు చేస్తుంది. కొబ్బరి నీళ్లలో ఏలకులు కలిపి తాగడం వల్ల కిడ్నీలు డిటాక్సిఫై అవుతాయి. కొబ్బరి నీళ్లను తాగే ప్రతిసారీ దానికి కొంచెం యాలకుల పొడిని కలపి తీసుకుంటే చాలామంచిదంటున్నారు వైద్యులు.. ఈసారి అలా ట్రే చేసేయండి.

నిమ్మ రసం- వేడి నీరు: నిమ్మకాయ మన శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఉదరానికి సంబంధించిన సమస్య ఏదైనా సరే నిమ్మకాయ తొలగిస్తుంది. నిమ్మకాయలోని విటమిన్ సి శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలను తొలగించేందుకు, కిడ్నీ డిటాక్స్ కోసం నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీటిని డైలీ ఉదయం తాగడం అలవాటుగా చేసుకోండి. దీనివల్ల ఒక్క కిడ్నీ ఆరోగ్యమే కాదు.. అధిక బరువు సమస్య కూడా ఉండదు.

కిడ్నీలకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే వైద్యులు ఇచ్చిన టాబ్లెట్స్‌నే వాడాలి. ఊర్లలో ఆర్‌ఎంపీలు ఇచ్చే మాత్రలు కిడ్నీలకు అస్సలు వాడకూడదు. దాని వల్ల ప్రాణాంతకం కూడా అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version