తెలంగాణాలో ఆ జిల్లాలో పంజా విసిరిన పులి, మరొకరిని చంపి తినేసింది…!

-

తెలంగాణాలో పులి దారుణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొమరం భీమ్ జిల్లాలో ఇప్పుడు వరుసగా పులి బ్రతికి ఉన్న వారిని చంపేస్తుంది. దీనితో ఇప్పుడు ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకు ఇద్దరినీ చంపేసిన పులి తాజాగా మరొకరిని కూడా చంపేసింది. మహారాష్ట్ర, తెలంగాణా సరిహద్దుల్లో పంజా విసిరిన పెద్ద పులి మరొకరిని చంపేసింది. ఈసారి పులి సరిహద్దుల్లో చంద్రపూర్ జిల్లాలో దాడి చేసింది.

కెమర లో పశువుల కాపరి సుజత్(18) ని చంపి తినేసింది. వరుస దాడుల నేపథ్యంలో కొమురంభీం జిల్లాలో భయాందోళన నెలకొంది. ప్రజలు ఒంటరిగా వెళ్ళొద్దని అధికారుల సూచనలు చేస్తున్నారు. 8 మందికి తగ్గకుండా గుంపులుగా ,శబ్దాలు చేస్తూ వెళ్లాలని ప్రచారం చేస్తున్నారు. ఎన్టీసీఏ గైడ్ లైన్స్ ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు మీడియాకు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version