విద్యార్థులు,పేరెంట్స్, కాలేజీల కోరిక మేరకు ప్రత్యేకంగా దోస్త్(dost) ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ను దోస్త్ కన్వీనర్ లింబాద్రి ప్రారంభించారు. ఈ ప్రత్యేక రిజస్ట్రేషన్ కు చివరి తేదీ డిసెంబర్ 3 అంటే ఈరోజే. ఇక ఈరోజు రిజిస్టర్ చేసుకున్న వారికి సీట్ అలాట్ మెంట్ ఈ నెల ఐదో తేదీన వుంటుంది. సీటు పొందిన విద్యార్థులు 8తేదీ లోపు కాలేజీలో ఫిజికల్ గా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
ఇదే చివరి అవకాశం కాబట్టి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని దోస్త్ కన్వీనర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని సుమారు వెయ్యికాలేజీల్లో సుమారు మూడులక్షలకు పైగా డిగ్రీ సీట్లు ఉన్నాయి. దీంతో వాటిని ఎలా అయినా ఫిల్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. అయితే ఇప్పటికీ ఆ సీట్లు ఫిల్ అవుతాయన్న నమ్మకం అయితే కనపడడం లేదు. చూడాలి మరి ఏమవుతుందో ?