తెలంగాణ అమరులకు ఈటల నివాళి.. అనంతరం..

-

హైదరాబాద్: ఈటల రాజేందర్ గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమ కూడా తెలంగాణ అమవీరులకు నివాళులర్పించారు. కాసేపట్లో ఆయన తన రాజీనామా పత్రాన్ని స్పీకర్‌ కార్యాలయంలో అందజేయనున్నారు.

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. టీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చి ఉండొవచ్చు గాని గెలిపించింది మాత్రం ప్రజలేనన్నారు. హుజురాబాద్‌లో కౌరవులు, పాండవులకు మధ్య యుద్ధం జరగబోతోందని ఆయన తెలిపారు. అధికార దుర్వినియోగం చేసి ఉపఎన్నికలో గెలవాలని చూస్తున్నారని ఈటల ఆరోపించారు. 17 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగానని చెప్పారు. కరోనాతో తెలంగాణలో వేల మంది చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోదని విమర్శించారు. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశానని చెప్పారు. సమైక్య పాలకులపై అసెంబ్లీలో గర్జించానని ఈటల తెలిపారు.

కాగా ఈటల రాజేందర్ ఈ నెల 14న బీజేపీలో చేరనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈటల సహా ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ కూడా కాషాయం జెండా కప్పుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version