తమన్: త్రివిక్రమ్ నా జీవితాన్ని మలుపు తిప్పారు.!

-

త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ప్రేక్షకులతో పాటు టెక్నీషియన్ లో, దర్శకులలో కూడా ప్రత్యేక మైన అభిమానం సంపాదించుకున్నారు. అందరూ ఆయన్ని గురూజీ గా పిలుచుకుంటారు.  ఆయన తో కొంచం సేపు టైమ్ గడిపితే చాలు హాయిగా ఉంటుందని మైండ్ ప్రెస్ అవుతుందని చెపుతూ ఉంటారు.ఇక తాను ఒక హీరో,  తో సినిమా చేస్తే మళ్లీ వారితోనే సినిమాలు రిపీట్ చేస్తూ ఉంటారు. ఇక మహేశ్ మూడు సినిమాలు, అల్లు అర్జున్ తో మూడు సినిమాలు, పవన్ కళ్యాణ్ తో మూడు సినిమాలు ఇలా వరసగా వారితోనే మార్చి మార్చి తీస్తూ ఉంటారు.

ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు తో SSMB28 వర్కింగ్ టైటిల్ పై సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. గతంలో  తమన్ ను RRR` మూవీతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి రాజమౌళి తీసుకెళ్లాడని దీనికి మీ స్పందన ఏంటి , మీరు కూడా ఆస్కార్ అవార్డు బరిలో ఉండడం కోసం ఏమైనా చేస్తారా అని మీడియా ప్రతినిధుల అడిగితే మా డైరెక్టర్ త్రివిక్రమ్ గారు మమ్ముల్ని ఆస్కార్ అవార్డు స్థాయికి తీసుకు వెళతారు అంటూ నమ్మకంగా చెప్పాడు.

ఇప్పుడు మరో సారి త్రివిక్రమ్ గురించి ఆసక్తికరమైన విషయం చెప్పాడు. ఆయన మాట్లాడుతూ నిజానికి తన లైఫ్ చూసుకుంటే త్రివిక్రమ్ గారితో పరిచయానికి ముందు, అలానే ఆయనతో పరిచయం తరువాత అని చెప్తానని అన్నారు. ముఖ్యంగా ఆయన తన లైఫ్ లో బెస్ట్ పర్సన్ అని అన్నారు. అలానే అయనతో పనిచేసిన అరవింద సమెత సినిమాను జీవితం లో మర్చిపోలేనన్నారు.  ఆ సినిమా కోసం ఎంతో ప్రాణం పెట్టానని, ఆ తరువాత వచ్చిన అలవైకుంఠపురములో మూవీస్ సాంగ్స్ అవుట్ పుట్ కూడా అంత అద్భుతంగా రావడానికి కారణం త్రివిక్రమ్ గారే మొదటి కారణం. మేముకొద్దిగా సాయం మాత్రమే చేశాము అని తన భక్తి భావం చాటుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version