ఓరి నాయనో..ఇదేం దరిద్రంరా బాబు.. మనుసులు తింటారా?

-

ఈ మధ్య మనుషులు మహా ముదుర్లు అవుతున్నారు.. కొత్త కొత్త ఐడియాలని చెప్పి మనుషుల ప్రాణాలను తీస్తున్నారు.. కొత్త వంటల పేరుతో ప్రయోగాలు చేస్తున్నారు. అందులో కొన్ని క్లిక్ అవుతున్నాయి. మరికొన్ని షాక్ ఇస్తున్నాయి. తాజాగా ఓ వీధి వ్యాపారి ఐస్‌క్రీంతో దోశ తయారు చేసి కొత్త ట్రెండ్‌ను సృష్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది..

మన దేశంలో దోశకు ఉన్న క్రేజే వేరు. క్రిస్పీగా ఎంతో రుచికరంగా ఉండే ఈ దోశను పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, ఈ దోశలో చాలా వెరైటీలు ఉన్నాయి. మసాలా దోశ, ఉల్లి దోశ, కారం దోశ, పొడి మసాలా దోశ, ఘీ కారం దోశ, రోస్ట్‌ దోశ, ఎగ్‌ దోశ, ప్లెయిన్‌, బట్టర్, ఛీజ్‌, పిజ్జా దోశ.. ఇలా చెప్పుకుంటూ పోతే వందకు పైగా వెరైటీ దోశలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఆహార ప్రియులు వారికి ఇష్టమైన వెరైటీ వెరైటీ దోశలను ఆస్వాదిస్తూ ఆరగించేస్తున్నారు.

అయితే, తాజాగా సోషల్ మీడియాలో ఒక విచిత్రమైన దోశ వైరల్ . అదే.. ఐస్‌క్రీం దోశ.. షాకయ్యారు కదూ. ఈ కాంబినేషన్‌ దోశ ఎప్పుడూ విని ఉండరు. చూసి ఉండరు కూడా. ఓ వీధి వ్యాపారి ఐస్‌క్రీంతో దోశ తయారు చేసి కొత్త ట్రెండ్‌ను సృష్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అది చూసిన నెటిజన్లు షాక్‌ అవుతూ కామెంట్లు పెడుతున్నారు.. నిజంగా ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.. మీరు కూడా ఒక లుక్ వేసుకోండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version