త్రివిక్రమ్ శ్రీనివాస్ భాద తీరే రోజు వచ్చింది..!!

-

త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ప్రేక్షకులతో పాటు టెక్నీషియన్ లో, దర్శకులలో కూడా ప్రత్యేక మైన అభిమానం సంపాదించుకున్నారు. అందరూ ఆయన్ని గురూజీ గా పిలుచుకుంటారు. సినిమా పరిశ్రమ లో చాలా మంది స్ట్రగుల్ లో ఉంటే ఆయనతో కొంత సమయం కేటాయిస్తే చాలు హాయిగా ఫీల్ అవుతారు. ఇక ఆయన పెన్ను పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇక ఆయన అల వైకుంఠ పురంలో సినిమా విడుదల తర్వాత మహేశ్ బాబు సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా చాలా ప్రాబ్లమ్స్ వల్ల స్టార్ట్ కాని సంగతి తెలిసిందే. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిరాశ పోగొట్టే న్యూస్ బయటకు వచ్చింది.మహేశ్ గ్రీన్ సిగ్నల్ తో ఈ నెల 15 లేదా 16వ తేదీన మంచి ముహూర్తాన ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇప్పటికే ఆకలి మీదున్న త్రివిక్రమ్ఇక ఈ సినిమా షూటింగ్  ఐదు నెలల లోనే పూర్తి చేయాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాడు. దీని కోసం పక్కాగా స్ర్కిప్ట్ వర్క్, షెడ్యూల్ ప్లానింగ్ కూడా  పూర్తి చేసుకొని రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇక మరొక నెలలో  మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి మొత్తానికి సినిమాను 2023 ఆగస్టులో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version