మలయాళంలో రూపొందిన `కప్పెలా` సినిమాకి రీమేక్ గా వచ్చిన బుట్ట బొమ్మ సినిమా దారుణ పరాజయాన్ని చవి చూసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా ఫలితం పై స్పందించారు నిర్మాత నాగవంశీ. అంతేకాకుండా ఈ సినిమా పెద్దగా ఆడదని ముందే గ్రహించామని చెప్పుకొచ్చారు.. బుట్ట బొమ్మ సినిమా సితార ఎంటర్టైన్మెంట్ నుంచి వచ్చింది. చాలావరకు ఈ బ్యానర్ నుంచి వచ్చే సినిమా అంటే మినిమం గ్యారంటీ ఉంటుందని చెప్పవచ్చు. కానీ ఈ సినిమా మాత్రం అంచనాలను తలకిందులు చేసింది. గత వారం విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ గా నిలిచింది. మొదటి షో నుంచి సినిమా ఫ్లాప్ అనే టాక్ తెచ్చుకుంది.. అయితే తాజాగా ఈ చిత్ర ఫలితం పై స్పందించిన నిర్మాత నాగ వంశీ వైరల్ కామెంట్స్ చేశారు..
తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగ వంశీ బుట్ట బొమ్మ సినిమా ఫ్లాప్ అవుతుందని ముం
దే ఊహించానని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా.. “మలయాళ మూవీ నచ్చి రీమేక్ చేయాలనుకున్నా. కానీ మూడేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. అప్పుడు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఆడియెన్స్ అభిరుచి మారిపోయింది. దీంతో ఈ సినిమా ఫెయిల్ అయ్యింది. అయితే విడుదలకు ముందే ఈ సినిమాని చూసిన బాబాయి రాధాకృష్ణ, దర్శకుడు త్రివిక్రమ్ ఫలితాన్ని ముందే ఊహించారు… ” అని చెప్పుకొచ్చారు.. అలాగే అందుకే మేం డిస్ట్రిబ్యూటర్ల నుంచి డబ్బులు తీసుకోకుండానే రిలీజ్ చేశామని అన్నారు..
అలాగే ప్రస్తుతం నిర్మాత నాగ వంశీ ‘సార్’ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. ఇందులో హీరోగా ధనుష్ నటిస్తున్నారు.. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడిన నాగ వంశీ.. “చదువు గొప్పతనం చెప్పే చిత్రమిది. చదువు వెనకాల పడే స్ట్రగుల్‌ని తెలియజేసేలా ఈ చిత్రం ఉండబోతుంది.. కచ్చితంగా హిట్ అవుతుంది.. ధనుష్ చాలా బాగా చేశారు, తెలుగు ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుంది.. ” అన్నారు..