“ప్రాజెక్ట్ కె” ప్రభాస్ లుక్ పై దారుణంగా ట్రోల్స్ … !

-

ఈ రోజు మధ్యాహ్నం హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ “ప్రాజెక్ట్ కె” లో హీరోగా నటిస్తున్న ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల అయిన సంగతి తెలిసిందే. కాగా ఈ లుక్ ను చూసిన అభిమానులు బాగా అసంతుప్తికి లోనయ్యారని స్పష్టంగా తెలుస్తోంది. ఈ సినిమా గురించి ముందు నుండి మూవీ యూనిట్ మొత్తం గొప్ప గొప్పగా చెప్పుకుంటూ వస్తోంది. అందుకే ఫ్యాన్స్ కూడా ఫస్ట్ లుక్ అంటే అవెంజర్స్ స్థాయిలో ఉంటుందేమో అని ఆతృతగా ఎదురుచూశారు. కానీ చివరకు చూస్తే… ఈ లుక్ కాస్త ఎడిట్ చేసిన పిక్ లాగా, బాడీ ఒకరిది పేస్ ఒకరిదిలాగా , ఫ్యాన్ మేడ్ పిక్ , ఫేక్ పిక్ అంటూ రకరకాలుగా నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలియచేస్తున్నారు.మరికొందరు అయితే ఇదేమి లుక్ రా బాబూ… మరో ఆదిపురుష్ చేస్తున్నారా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా ఇంతలా ఫస్ట్ లుక్ విషయంలోనే ట్రోల్స్ గురవుతోంది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news