ఈ రోజు ఎమెర్జింగ్ ఆసియా కప్ టోర్నమెంట్ లో భాగంగా ఇండియా మరియు పాకిస్తాన్ ల మధ్యన జరిగిన మ్యాచ్ లో ఇండియా యంగ్ టీం విజయకేతనాన్ని ఎగురవేసింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్ లలో
208 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఇండియా బౌలర్లలో హాంగార్గేకర్ అయిదు వికెట్లతో చెలరేగి పాకిస్తాన్ ను చిత్తు చేశాడు. బదులుగా ఛేదన ఆరంభించిన ఇండియా ఆటగాళ్లు కేవలం 36 .4 ఓవర్ లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంలో ఓపెనర్ సాయి సుదర్శన్ ది కీలక పాత్ర అని చెప్పాలి. ఇతను ఆరంభం నుడ్ని క్రీజులో ఉండి చివరి వరకు నిలబడి అద్భుతమైన సెంచరీ చేసి జట్టుకు విజయాన్ని అందించారు. ఇతను ఇన్నింగ్స్ లో
10 ఫోర్లు మరియు మూడు సిక్సులు ఉండడం విశేషం.
నికిన్ జోస్ అర్ద సెంచరీ చేసి ఇతనికి చక్కని సహకారం అందించాడు. ఆఖర్లో యాష్ ధూల్ మెరుపులు మెరిపించాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఇండియా మూడు కు మూడు గెలిచి అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.