టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ కూతురు సారా టెండూల్కర్, యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ గత కొద్ది రోజులుగా ఒకరినొకరు సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు. వీరు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌పెట్టి ఐ స్పై అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇద్దరూ ఒకే క్యాప్షన్ పెట్టడంతో వీళ్ల మధ్య సమ్‌థింగ్..సమ్‌థింగ్ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సారా పెట్టిన క్యాప్షన్‌ను గిల్ కాపీ చేయడంతో నెటిజన్లు ఆటపట్టిస్తున్నారు.
మంచి ఆల్‌రౌండర్‌గా పేరు సంపాదించుకున్నాడు యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్. ప్రస్తుతం ఐపీఎల్‌లో సత్తాచాటేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. కరోనా వల్ల ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతున్న గిల్ గత కొన్నిరోజుల నుంచి సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటున్నాడు.