జనవరిలో ఈ రాశుల వాళ్లకి ఇబ్బందులట.. జాగ్రత్తగా వుండండి..!

-

కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు బుధగ్రహం 29 డిసెంబర్ నుండి మకర రాశి లోకి ప్రవేశిస్తుంది. జనవరి 21 వరకు ఈ రాశిలో ఉంటుంది అయితే అప్పటి వరకు కూడా కొన్ని రాశుల వాళ్లకి ఇబ్బంది కలుగుతాయని పండితులు అంటున్నారు. ఈ అశుభ ఫలితాలు ప్రభావం చాలా రెట్లు పెరుగుతుందని అంటున్నారు. అయితే మరి ఆ రాశులు ఏమిటి..?, ఎవరెవరికి ఇబ్బందులు వస్తాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం.

 

మేష రాశి :

ఈ రాశి వాళ్లు కొద్దిగా సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థికంగా కొన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండటం మంచిదని పండితులు అంటున్నారు.

మిధున రాశి:

అలానే మిధున రాశి వాళ్ళు కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తాయి. అలానే అలర్జీలు, చర్మ సమస్యలు వంటివి ఉండే అవకాశం ఉంది.

సింహరాశి:

సింహ రాశి వాళ్ళకి కుటుంబంలో కొన్ని వివాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మిత్రులతో, తల్లితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది.

మకర రాశి:

ఈ రాశి వాళ్ళకి నిద్రలేమి సమస్య వచ్చే అవకాశం ఉంది అలాగే ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం వంటివి అనుసరిస్తే మంచిది.

కుంభ రాశి:

ఈ రాశి వాళ్ళకి కూడా ఇబ్బందులు వస్తాయి కష్టపడితేనే ఫలితాలు లభిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ప్రతి దాంట్లో అనుసరించాలి అనవసరమైన ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version