ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ పేరుతో రామాయణం ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ సినిమా కంటే ముందే రామాయణాన్ని తెరకెక్కించాలని టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ భావించారు. బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ ఈ చిత్రానికి దర్శకుడు. హిందీతో పాటు అన్ని భాషల్లో రూపొందనున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ కి త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నాడట. స్క్రీన్‌ప్లే తో పాటు మాటలు కూడా రాస్తున్నాడని సమాచారం.
ప్రస్తుతం తెలుగు దర్శకులలో రామాయణ మహాభారతాల మీద ఎక్కువ జ్ఞానం ఉన్న త్రివిక్రమ్ కే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు అప్పగించాడట. దాదాపుగా అన్ని పనులు పూర్తయ్యాయట. వచ్చే సంవత్సరం చిత్రీకరణకి వెళ్ళనుందని తెలుస్తుంది. 500కోట్ల బడ్జెట్ తో భారీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూడాలి. అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న త్రివిక్రమ్, తర్వాతి చిత్రాన్ని తారక్ తో చేస్తున్నాడు.