పార్టీ ఫండ్ ఇవ్వలేదనే టీఆర్ఎస్ నేత హత్య ?

ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాకా గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ నేత భీమేశ్వరరావు అనే వ్యక్తిని మావోయిస్టులు నిన్న రాత్రి పొడిచి చంపిన సంగతి తెలిసిందే. నిజానికి భీమేశ్వరరావుని పలుమార్లు పార్టీ ఫండ్ అడగగా ఆయన తిరస్కరించారు. దానికి కక్షసాధింపు చర్యగా సాయుధులైన ఆరుగురు మావోయిస్టులు నిన్న అర్ధరాత్రి అతని ఇంటి లోకి బలవంతంగా ప్రవేశించి భీమేశ్వరరావు పై దాడి చేసి కుటుంబ సభ్యులు ప్రాధేయ పడుతున్నా వినకుండా అతి దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారని పోలీసులు ప్రకటించారు.

జిల్లా సరిహద్దు గ్రామాలకు చెందిన గిరిజనులను ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు దూరం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటూ రోడ్లను తవ్వి సామాన్య ప్రజానీకానికి మావోలు ఆటంకాలకు గురి చేస్తున్నారని అన్నారు. మావోయిస్టుల పార్టీ ఫండ్ ఇవ్వని సామాన్య ప్రజలను పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో హత్యాకాండ చేస్తున్నారని ఒక ప్రకటన విడుదల చేశారు. ఐదు రోజుల క్రితమే డీజీపీ, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు వెంకటాపురంలో పర్యటించారు. వారికీ సవాల్ విసురుతూ ఘటనా స్థలంలో లేఖ వదిలారు మావోయిస్టులు.