వారికి షాక్ : ఈసారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా ఏకాంతంగానే !

-

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణ పై డైలమాలో ఉంది టీటీడీ. ఎందుకంటే రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టినా చిత్తూరు జిల్లాలో మాత్రం కరోన వ్యాప్తి తగ్గడం లేదు. అయితే గతంలో వినాయక చవితి, ఓనం పండగల అనంతరం మహారాష్ట్ర, కేరళలో భారీగా కేసులు పెరిగినట్టు గుర్తించారు. దీంతో బ్రహ్మోత్సవాల సమయంలో వాహన సేవలను తిలకించేందుకు పరిమితికి మించి భక్తులు గ్యాలరీలలోకి చేరుకుంటే కరోనా వ్యాప్తి చెందే అవకాశం వుందని టీటీడీ, జిల్లా యంత్రాంగం నిర్దారణకు వచ్చారు.

ఈ రోజు అధికారుల క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహించేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు చెబుతున్నారు. లేదా భౌతిక దూరం పాటిస్తూ గ్యాలరిలో 7 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించే అవకాశం కూడా ఉంది. అయితే అంతకు మించి భక్తులు వస్తే పరిస్థితి ఏంటనే యోచనలో టీటీడీ ఉంది. ఈరోజు స్వయంగా గ్యాలరిలను పరిశీలించి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే నిర్వహించాలా లేక ఊరేగింపు నిర్వహించాలన్న అంశం పై ఈవో జవహర్ రెడ్డి నిర్ణయం తీసుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news